వాట్సాప్‌లో ఆహ్వాన పత్రిక చక్కర్లు

Poling Invitation Card in Whatsapp - Sakshi

మిర్యాలగూడ టౌన్‌ : ఈనెల 11వ తేదీన జరగనున్న 13వ లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కొంత మంది యువకులు ఆహ్వాన పత్రిక ముద్రించి వాట్సాప్‌లో పోస్ట్‌ చేశారు. ఆహ్వానం...సాధారణ ఎన్నికలు–2019, నూతన సభ్యుల ఉత్సవం, ముహూర్తం 11.04.2019 గురువారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6గంటలు, వేదిక.. మీ ప్రాంతంలోని మీ ఓటు నమోదైన పోలింగ్‌ కేంద్రం, విన్నపం...ఈ ఎన్నికల ఉత్సవానికి సంబంధించి ఎటువంటి కానుకలు ఇవ్వరాదు...తీసుకోరాదు.. అంటూ ఓటర్లను ఆకట్టుకునే విధంగా ముద్రించారు. ఈ వాట్సాప్‌లో చక్కర్లు కొడుతున్న ఆహ్వాన పత్రికపై సర్వత్రా చర్చ జరుగుతుంది.     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top