హిజ్రాలకు పోలీసుల క్లాస్.. | Police counselling to third genders | Sakshi
Sakshi News home page

హిజ్రాలకు పోలీసుల క్లాస్..

Oct 19 2015 3:16 PM | Updated on Sep 4 2018 5:16 PM

హిజ్రాలకు పోలీసుల క్లాస్.. - Sakshi

హిజ్రాలకు పోలీసుల క్లాస్..

సుమారు 200 మంది హిజ్రాలు, ట్రాన్స్‌జెండర్లు, బుడగ జంగాలకు పోలీసులు క్లాస్ తీసుకున్నారు.

మల్కాజ్‌గిరి (హైదరాబాద్) : సుమారు 200 మంది హిజ్రాలు, ట్రాన్స్‌జెండర్లు, బుడగ జంగాలకు పోలీసులు క్లాస్ తీసుకున్నారు. నగరంలోని అల్వాల్ పీవీఆర్ గార్డెన్స్ సోమవారం ఇందుకు వేదికగా నిలిచింది. డీసీపీ రమా రాజేశ్వరి, ఏసీపీలు సయ్యద్ రఫీక్, రవిచందర్ రెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇందులో మల్కాజ్‌గిరి పీఎస్ పరిధిలో నివసించే హిజ్రాలు, ట్రాన్స్‌జెండర్లు, బుడగ జంగాల వారితోపాటు స్థానిక షాపుల నిర్వాహకులు పాల్గొన్నారు.

షాపుల వెంట తిరుగుతూ డబ్బులు అడగడం, ఇవ్వకపోతే దాడులకు పాల్పడడం చట్టరీత్యా నేరమని, కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని పోలీసులు వారికి తెలియజేశారు. అయితే తాము హిజ్రాలమని, తమకు ఎవరూ ఉద్యోగాలు ఇవ్వరని, పోషణకు అడుక్కోవడమే మార్గమని వారన్నారు. బుడగ జంగాల వారు కూడా తమలాగే వేషాలు వేసుకుని అడుక్కుంటున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా వేషాలు వేసుకుని అడుక్కోవడం తమ కులవృత్తి అని బుడగ జంగాల వారు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement