
సుప్రీంకోర్టు, నిందితుల ఎన్‌కౌంటర్ ఘటన (ఫైల్)
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన దిశ నిందితుల ఎన్‌కౌంటర్ ఘటనపై సర్వోన్నత న్యాయస్థానంలో మరో పిటిషన్ దాఖలైంది. దిశ హత్యాచారం ఘటనలో అరెస్టయి.. పోలీసు కస్టడీలో ఉన్న నిందితులను చటాన్‌పల్లి వద్ద ఎన్‌కౌంటర్ చేయడంపై సుప్రీంకోర్టులో సోమవారం తాజాగా మరో పిటిషన్ దాఖలైంది. కస్టడీలో ఉన్న నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ సామాజిక కార్యకర్త కే. సజయ పిటిషన్ దాఖలు చేశారు. అంతేగాక అత్యవసరంగా న్యాయ విచారణ చేపట్టాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు. దీంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే.. సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ ముందు ప్రస్తావించాలని సూచించారు.
చదవండి: (దిశ : పోలీసులపై కేసు పెట్టారా లేదా?)