ప్రచారానికి వస్తే పవన్ కళ్యాణ్‌ను తరిమికొడతాం | Pawan Kalyan to drive when it comes to campaign kodatam | Sakshi
Sakshi News home page

ప్రచారానికి వస్తే పవన్ కళ్యాణ్‌ను తరిమికొడతాం

Aug 29 2014 1:00 AM | Updated on Mar 22 2019 5:33 PM

ప్రచారానికి వస్తే పవన్ కళ్యాణ్‌ను తరిమికొడతాం - Sakshi

ప్రచారానికి వస్తే పవన్ కళ్యాణ్‌ను తరిమికొడతాం

మెదక్ పార్లమెంట్ సీటుకు జరిగే ఉప ఎన్నికల ప్రచారానికి సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రచారానికి వస్తే తరిమి కొడతామని ఓయూలోని వివిధ విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు.

  • ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు
  • ఉస్మానియా యూనివర్సిటీ: మెదక్ పార్లమెంట్ సీటుకు జరిగే ఉప ఎన్నికల ప్రచారానికి సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రచారానికి వస్తే తరిమి కొడతామని ఓయూలోని వివిధ విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు. గురువారం ఓయూ జేఏసీ నేత కందుల మధు అధ్యక్షతన క్యాంపస్‌లో టీ-జాక్, ఓయూ జాక్, టీఆర్‌ఎస్వీ, టీఎంఎస్‌వై, బీఎస్‌ఎఫ్, టీఎంఎస్, ఎస్టీ,ఎస్టీ విద్యార్థి సంఘాల నాయకులు సమావేశమయ్యారు.

    ఇందులో మెదక్ టీఆర్‌ఎస్ అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సీమాంధ్రుల ఏజెంట్, తెలంగాణ ఉద్యమ ద్రోహి జగ్గారెడ్డికి బీజేపీ సీటు ఇవ్వడం సిగ్గు చేటని విమర్శించారు. ఆయన తరపున పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తే భౌతిక దాడులు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో విద్యార్థి జేఏసీ నాయకులు పిడమర్తి రవి, గెల్లు శ్రీనివాస్ యాదవ్, గాదె వెంకట్, మర్రి అనిల్, విక్రమ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement