సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో భారీ క్యూలైన్లు | Passenger Trains Begin In Secunderabad Railway Station | Sakshi
Sakshi News home page

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో భారీ క్యూలైన్లు

Jun 1 2020 11:16 AM | Updated on Jun 1 2020 12:01 PM

Passenger Trains Begin In Secunderabad Railway Station - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సోమవారం నుంచి దేశవ్యాప్తంగా పరిమిత సంఖ్యలో రైలు సర్వీసులు ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల నుంచి 9 రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఉదయం ఆరుగంటలకు నాంపల్లి నుంచి తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఢిల్లీకి బయలుదేరింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు చేరుకోవడంతో భారీ క్యూలైన్‌ ఏర్పడింది. ప్రయాణికులంతా రైలు బయలుదేరే సమయానికి 90-120 నిమిషాల ముందే రావాలని సూచించడంతో పెద్దసంఖ్యలో ప్రయాణికులు తెల్లవారుజాము నుంచే రైల్వే స్టేషన్‌కి చేరుకున్నారు. దేశవ్యాప్తంగా 100 రూట్లలో 200 ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ నడుపుతుంది. తొలి రోజు లక్షా 45వేల మంది ప్రయాణాలు చేయనున్నారు. ఆన్‌లైన్, రైల్వే బుకింగ్ కౌంటర్లలో రిజర్వేషన్‌కు అవకాశం కల్పించారు. థర్మల్ స్క్రీనింగ్ తర్వాత టికెట్ ఉన్న వారికే స్టేషన్‌లోకి అనుమతిస్తారు. ప్రతి ప్రయాణికుడు తప్పని సరిగా మాస్క్ ధరించాలని నిబంధన విధించారు.

 


 


 

Advertisement
 
Advertisement
Advertisement