కారులోనే పెట్‌

Owner Forgetten Pet Dog in His Car Hyderabad - Sakshi

మరిచిపోయి డోర్‌ వేసిన యజమాని

హిమాయత్‌నగర్‌: పెట్‌ కారులో ఉండగానే మరిచిపోయి ఓ యజమాని డోర్‌ క్లోజ్‌ చేశాడు. పెట్‌తో పాటు కీస్‌ కూడా కారులోనే మరిచిపోవడంతో... దాదాపు 20 నిమిషాలు పెట్‌ అందులోనే ఉక్కిరిబిక్కిరైంది. వివరాలు... నారాయణగూడలోని సూపర్‌ స్పెషాలిటీ వెటర్నరీ హాస్పిటల్‌కు ముసారాంబాగ్‌కు చెందిన కీర్తి తన పెట్‌ను తీసుకొచ్చింది. కిందికి దించితే అల్లరి చేస్తుందనే ఉద్దేశంతో కారులోనే ఉంచింది. అయితే కారు కీస్‌ కూడా లోపలే ఉండడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురైంది. డోర్‌ తీసేందుకు స్థానికులు ప్రయ త్నించగా రాకపోవడంతో చివరకు పగలగొట్టారు. పెట్‌ను సురక్షితంగా బయటకు తీశారు. దీంతో కీర్తి ఊపిరి పీల్చుకుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Tags: 
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top