పేలిన నాటుబాంబు: ఒకరికి గాయాలు | one injured in bomb blast in khammam district | Sakshi
Sakshi News home page

పేలిన నాటుబాంబు: ఒకరికి గాయాలు

Jun 22 2016 11:11 AM | Updated on Sep 4 2017 3:08 AM

తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని వెంకటాపురం గ్రామంలో బుధవారం నాటుబాంబు పేలింది.

ఖమ్మం:  తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని వెంకటాపురం గ్రామంలో బుధవారం నాటుబాంబు పేలింది. ఈ ఘటనలో ఒకరు గాయపడ్డారు. ఛత్తీస్‌గఢ్ వైపు వెళ్లే వెంకటాపురం మండలం విజయపురి కాలనీ సమీపంలో రహదారి పక్కన బాంబుపేలింది. ఈ పేలుడులో ఓ బాటసారి గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.. క్షతగాత్రుడిని 108 వాహనంలో మధిర  ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నాటు బాంబు పేలిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఇది నాటుబాంబా లేక కూంబింగ్‌కు వెళ్లే పోలీసులను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు అమర్చిన బాంబా అనే విషయం తేలాల్సి ఉందని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement