బనశంకరి: కర్ణాటకలోని మంగళూరులో సంచలనాత్మక కుక్కర్ బాంబ్ పేలుడు కేసులో అనుమానిత ఉగ్రవాది మహమ్మద్ షారిక్‌కు పదేళ్ల కఠిన జైలుశిక్ష విధిస్తూ సోమవారం ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పటికే అనుభవించిన 4 ఏళ్లను మినహాయించి, మిగిలిన 6 ఏళ్లు జైల్లో ఉంచాలని ఆదేశించింది.
ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగిన షారిక్ పేలుళ్ల ద్వారా విధ్వంసం సృష్టించాలని పథకం వేశాడు. కుక్కర్‌లో టైం బాంబును అమర్చి 2022 నవంబర్ 19 సాయంత్రం ఓ రద్దీ ప్రదేశంలో అమర్చాలని ఆటోలో బయల్దేరాడు. అయితే ఆ బాంబు ఆటోలోనే పేలిపోయి నిందితుడు, ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. మంగళూరు పోలీసులు విచారణ చేపట్టారు.


