లారీ ఢీకొని కేరళ వాసి మృతి | One dies in road accident | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని కేరళ వాసి మృతి

Nov 28 2015 4:42 PM | Updated on Aug 30 2018 3:56 PM

వేగంగా వెళ్తున్న లారీ.. ముందు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో బైక్‌పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు.

పటాన్‌చెరు (మెదక్) : వేగంగా వెళ్తున్న లారీ.. ముందు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో బైక్‌పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన మెదక్ జిల్లా రాంచంద్రాపురం మండలం కొల్లూరు గ్రామ శివారులో చోటుచేసుకుంది. కేరళ రాష్ట్రానికి చెందిన విజయ్ కుమార్ నగరంలో ఉంటూ ఓ కంపెనీలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం  పటాన్ చెరు నుంచి శంషాబాద్ బైక్ పై వెళ్తున్న సమయంలో కొల్లూరు శివారులోని ఔటర్ సర్వీస్ రోడ్డు వద్ద వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టడంతో.. విజయ్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement