'నర్సుల డెరైక్టరేట్‌ను ఏర్పాటు చేస్తాం' | nurses directorate soon says minister lakshma reddy | Sakshi
Sakshi News home page

'నర్సుల డెరైక్టరేట్‌ను ఏర్పాటు చేస్తాం'

May 12 2016 8:42 PM | Updated on Sep 3 2017 11:57 PM

తెలంగాణలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న వెయ్యి నర్సుల పోస్టులను భర్తీ చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి అన్నారు.

సుల్తాన్‌బజార్: తెలంగాణలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న వెయ్యి నర్సుల పోస్టులను భర్తీ చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం కోఠిలోని ఐఎంఏ ఆడిటోరియంలో తెలంగాణ రాష్ట్ర నర్సుల అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి లక్ష్మారెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... వైద్య రంగంలో నర్సుల పాత్ర కీలకమైందన్నారు. నర్సుల డెరైక్టరేట్‌ను ఏర్పాటు చేస్తామని, కాంట్రాక్ట్ నర్సులను పర్మినెంట్ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. నర్సింగ్‌కు సంబంధించి స్పెషలైజేషన్ కోర్సులను ప్రవేశపెడతామని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement