breaking news
Nurses Day
-
Nurses Day: ఈ దినోత్సవంలో హైలెట్‌గా ‘కృతజ్ఞతా గోడ’
రోగుల పట్ల అంకితభావంతో సేవలందిస్తున్న నర్సులను అపోలో హాస్పిటల్స్ గౌరవించింది. వారి సేవలు ఎంతో విలువైనవని ప్రశంసించింది. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణం కృతజ్ఞతాభావంతో నిండిపోయింది. తమ ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్న ఈ వైద్య సిబ్బందికి అపోలో ఆసుపత్రులు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి అభినందనలు తెలిపింది. ఈ వేడుకల్లో భాగంగా రూపొందించిన ‘కృతజ్ఞతా గోడ’ అందరి దృష్టిని ఆకర్షించింది. సహోద్యోగులు, రోగులు, వారి బంధువులు తమ నర్సింగ్ వీరుల పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ స్వయంగా రాసిన సందేశాలు, వేసిన చిత్రాలు, అతికించిన ఛాయాచిత్రాలతో ఆ గోడ నిండిపోయింది. ఎంతో ఆప్యాయంగా రాసిన ఆ మాటలు చదువుతుంటే నర్సుల కళ్లల్లో ఆనందం కనిపించింది.వారే వెన్నెముక..అంతర్జాతీయ నర్సుల దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్ – స్ట్రాటజీ, సిందూరి రెడ్డి మాట్లాడుతూ... “మా నర్సులు ఆరోగ్య వ్యవస్థకు వెన్నెముక వంటివారు. వారి సంక్షేమం మాకు అత్యంత ప్రాధాన్యమైనది. ప్రతి నర్సు భద్రమైన, ప్రోత్సాహకరమైన వాతావరణంలో ఎదగాలని, ప్రతి రోగికి అత్యుత్తమమైన వైద్యం అందాలని కోరుకుంటున్నాం. ‘ది పింక్ బుక్’ మా నర్సింగ్ సిబ్బంది కోసం సురక్షితమైన, సహాయక వాతావరణాన్ని అందించాలనే మా నిబద్ధతకు చిహ్నం” అని అన్నారు. అపోలో హాస్పిటల్స్ గ్రూప్ డైరెక్టర్ నర్సింగ్, కెప్టెన్ (డాక్టర్) ఉషా బెనర్జీ మాట్లాడుతూ.. “ఈ ఏడాది నినాదం ‘మన నర్సులు. మన భవిష్యత్తు. నర్సులను ఆదుకోవడం ఆర్థిక వ్యవస్థను బలపరుస్తుంది’. నర్సులు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు గుండె వంటివారు. వారి ఆరోగ్యం మాకు చాలా ముఖ్యం. వారి అసాధారణమైన కృషికి ఇవాళ గుర్తు చేసుకుంటున్నాం. వారికి నిరంతరంగా మద్దతునిస్తాం” అని అన్నారు.వైద్యం మాత్రమే కాదు..అపోలో హాస్పిటల్స్ తెలంగాణ రీజియన్ నర్సింగ్ డైరెక్టర్ సునీత డొమింగో మాట్లాడుతూ... "ఇవాళ మా నర్సుల గురించి చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఇక్కడి వాతావరణం ఎంతో ఉత్సాహంగా ఉంది. నర్సులు నిత్యం రోగుల కోసం తమ శక్తి మేరకు కృషి చేస్తూనే ఉంటారు. వారి పనిని మనం తప్పకుండా గౌరవించాలి. పాటలు, నృత్యాలు, మంచి మాటలు - ఇవన్నీ మనం చేస్తున్న పని యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నాయి. వారి సేవలను గుర్తించి, వారిని గౌరవించడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. నర్సులు అందిస్తున్న సేవ కేవలం వైద్యం మాత్రమే కాదు, మనమందరం కలిసి పనిచేయడానికి వారి సహకారం ఎంతో అవసరం అని మరోసారి గుర్తు చేసుకుంటున్నాం" అని పేర్కొన్నారు. నర్సుల దినోత్సవం సందర్భంగా అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్ ప్రాంగణంలో, సిబ్బంది నివాస సముదాయాలలో సాంస్కృతిక కార్యక్రమాలు, వేడుక విందులు ఏర్పాటు చేశారు. నర్సులు స్వయంగా సంప్రదాయ నృత్యాలు, సంగీత ప్రదర్శనలు, చిన్న నాటకాలు ప్రదర్శించారు.(చదవండి: Miss World 2025: సర్వాంగ సుందరంగా రామప్ప ఆలయం..) -
థ్యాంక్యూ సిస్టర్
గుంటూరు మెడికల్: ఆసుపత్రిలో 24గంటలూ రోగి పడకవద్దే ఉండి చిరునవ్వుతో వైద్యసేవలందిస్తూ వ్యాధి నుంచి రోగి కోలుకోవటంలో నర్సులు కీలకపాత్ర పోషిస్తారు. అనారోగ్యంతో ఉన్న వారిని సొంతవారే ఈసడించుకుంటున్న నేటి దినాల్లో రోగులకు ఆప్యాయంగా సేవలు అందిస్తూ మానవత్వపు విలువలున్నాయని నిరూపించుకుంటుంది నర్సులు మాత్రమే అనటంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. కాలిన గాయలు... కుళ్లిన శరీరభాగాలు... గాయపడి, రక్తమోడుతూ దుర్గంధం వెదజల్లే శరీరాలకు నర్సులు సేవలను అందిస్తారు. æసేవకు ప్రతిరూపంగా చెప్పుకొనే నర్సుల దినోత్సవాన్ని ఏటా మే 12న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఇదీ నేపథ్యం.. లేడీ విత్ ది ల్యాంప్ గా పేరు గాంచిన ఫ్లోరెన్స్ నైటింగేల్ 1820 మే 12న ఇటలీలో జని్మంచారు. 1854–56 లో క్రిమియాలో ఘోర యుద్ధం జరిగింది. ఫ్లారెన్స్ నైటింగేల్ తోటి నర్సుల సహాయంతో యుద్ధంలో గాయాలైన సైనికులకు నిరుపమానమైన సేవలందించింది. వారికి ధైర్యమూ చెప్పింది. నర్సులు చేసిన సేవలవలన యుద్ధంలో మరణించే రోగుల సంఖ్య బాగా తగ్గింది. యుద్ధంలో దెబ్బతిన్న ప్రతి సైనికుడికి తాను కోలుకుంటానన్న ఆశ చిగురింపచేసేలా ఆమె వైద్య సేవలందించింది. ఆమె సేవలను గుర్తించి ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా మే12న ఫ్లారెన్స్ నైటింగేల్ జయంతి రోజున నర్సుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. నర్సులు అందించే సేవలు... ఆసుపత్రిలో డాక్టర్ల తరువాత అత్యంత కీలకమైన పాత్ర నర్సులదే. ఆసుపత్రికి నర్సులు వెన్నుముక లాంటివారు. నిత్యం తెల్లటి వ్రస్తాలు ధరించి రోగుల పడకల వద్దే ఉంటూ వారికి వైద్య సాయం అందించడంతోపాటు, మానసిక స్థైర్యాన్ని సైతం కలి్పస్తుంటారు. వార్డులో ఉంటున్న రోగులకు కావాల్సిన మందులను పంపిణీ చేయటం, వార్డులో ఉండే రోగులకు కావాల్సిన మందులను మెడికల్ స్టోర్ నుంచి ఇండెంట్ పెట్టి తెప్పించటం, రోగుల పడకలను శుభ్రంగా ఉండేలా చేయించటం, ఫ్లూయిడ్స్ ఎక్కించటం, వ్యాధినిర్ధారణ పరీక్షలకు రోగిని పంపించటం, వార్డులో వర్క్‌షాపునకు సంబంధించిన పనులు చూడటం, యూనిట్ చీఫ్, అసిస్టెంట్ డాక్టర్లు రోగులను పరీక్షించేందుకు వచ్చినప్పుడు వారి వెంట ఉండి సహాయం చేయటం, వార్డు శుభ్రంగా ఉండేలా చూడటం తదితర పనులను నర్సులు చేస్తుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకు, గర్భణులకు టీకాలు వేయటం, కాన్పులు చేయటం కూడా నర్సులే చేస్తారు. నర్సింగ్ ప్రాధాన్యత గుర్తించిన ప్రభుత్వం... ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైద్య రంగానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. గుంటూరు జిల్లాలో టీచింగ్ ఆసుపత్రి మొదలు పీహెచ్సీ వరకు పలు నర్సింగ్ సిబ్బంది పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. జిల్లాలో 300 మంది కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో విధుల్లో చేరారు. గుంటూరు జీజీహెచ్‌లో 250 పోస్టులు ఒకేసారి మంజూరు చేసిన ప్రభుత్వం తద్వారా నర్సింగ్ సేవలు మెరుగ్గా అందేలా చర్యలు తీసుకుంది. డాక్టర్ వైఎస్సార్ విల్లేజ్ హెల్త్ క్లినిక్‌లలో సైతం బీఎస్సీ నర్సింగ్ చదివిన వారిని మిడ్‌లెవల్ హెల్త్ ప్రొవైడర్ పేరుతో రిక్రూట్మెంట్ చేసి గ్రామీణ ప్రాంతాల్లో సైతం మెరుగైన వైద్య సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నర్సింగ్ పోస్టులు పెంచినందుకు కృతజ్ఞతలు అధికారంలోకి రాగానే గుంటూరు జీజీహెచ్‌లో 250 స్టాఫ్‌నర్సుల పోస్టులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు. అధిక సంఖ్యలో పోస్టులు మంజూరు చేయడం ద్వారా రోగులకు మెరుగైన నర్సింగ్ సేవలు అందిస్తున్నాం. పలు రకాల ఇన్ఫెక్షన్లతో బాధపడుతూ చికిత్స కోసం వచ్చే రోగులకు వైద్య సేవలు అందిస్తున్నాం. వారు వ్యాధి నుంచి కోలుకుని ఇంటికి వెళ్లి మేము అందించిన సేవలను గుర్తించి ఫోన్లు చేస్తుంటారు. నా తల్లి చంద్ర లీలావతి, పిన్ని సుగుణ కుమారి, ఇరువురు కూడా నర్సింగ్ వృత్తిలో పనిచేశారు. పిన్ని ప్రొత్సాహంతో నర్సింగ్ వృత్తిలో ప్రవేశించాను. పలు ఆసుపత్రుల్లో వివిధ హోదాల్లో రోగులకు సేవలు అందించడం ఎంతో సంతృప్తినిచ్చింది. – కర్రెద్దుల ఆషా సజని, గుంటూరు జీజీహెచ్ నర్సింగ్ సూపరింటెండెంట్ పీహెచ్‌సీకి ముగ్గురు నర్సులు గతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఒక్కొక్కరు మాత్ర మే నర్సింగ్ సిబ్బంది ఉండేవారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు చేప ట్టగానే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నర్సింగ్ సే వలు మెరుగుపడేలా చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా ప్రతి పీహెచ్సీలో ముగ్గురు నర్సులను నియమించారు. అంతేకాకుండా సబ్ సెంటర్లు, సచివాలయాల్లో ఉండే ఏఎన్ఎంలకు సైతం జీఎన్ఎం శిక్షణ ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. – డాక్టర్ అమర్తలూరి శ్రావణ్‌బాబు, డీఎంహెచ్ఓ -
నర్సుల దినోత్సవం ఎలా మొదలైందో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అంటారు. అనారోగ్యం బారిన పడి ఆస్పత్రుల్లో చేరిన వారికి సేవలు చేసే చేతులు ఏవైనా ఉంటే అవి సేవామయులైన నర్సుల చేతులే. మానవ సేవే మాధవ సేవ అంటారు. అలా మానవ సేవ ద్వారానే తమ జీవితాన్ని సార్థకం చేసుకుంటున్న వారు నర్సులు. అయిన వారు కూడా ముట్టుకోవటానికి ఇబ్బంది పడినా, ఏ మాత్రం సంబంధం లేని నర్సులు సేవలు అందిస్తున్నారు. కరోనా అనగానే అల్లంత దూరం పారిపోయే కుటుంబ సభ్యులున్న నేటి రోజుల్లో కరోనా రక్కసి చేతిలో విలవిలలాడుతున్న వారికి నర్సులు అందిస్తున్న సేవలు ఎనలేనివి. పల్లె, పట్టణం తేడా లేకుండా అంతటా ఆయా ఆస్ప త్రులు, పీహెచ్‌సీల పరిధిలో పనిచేసే నర్సులు కరోనా బాధితులను గుర్తించడం నుంచి వారికి వైద్య సేవలు అందించి వారు కోలుకునేదాకా అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. ఇంటింటి సర్వే ద్వారా వ్యాధి లక్షణాలున్న వారిని గుర్తించి వారికి మందులు అందిస్తున్నారు. వీరంతా కరోనా పడగ నీడలో ఎప్పుడు వైరస్ బారిన పడతామో తెలియని పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తున్నారు. ఇప్పటికే పలువురు కరోనాతో ఇంటి దగ్గర ఉండి చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్ బారిన పడిన వేలాది మందికి సేవలందించడం ద్వారా నర్సులు ప్రజల అభిమానం చూరగొంటున్నారు. అయితే మరి ఈ రోజే నర్సుల దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా... 1820 మే 12న నర్సు వృత్తి గౌరవానికి ప్రతీక అయిన ఫ్లొరెన్స్ నైటింగేల్ పుట్టిన రోజు. 1854లో క్రిమియన్ యుద్ధం సందర్భంగా 38 మంది నర్సుల బృందం యుద్ధంలో గాయపడిన సైనికులకు విశేషమైన సేవలు అందించింది. ఇందులో ఫ్లొరెన్స్ నైటింగేల్ ఆ నర్సుల బృందానికి నాయకురాలిగా, మార్గదర్శకురాలిగా సేవలందించటంలో ఆదర్శంగా నిలించింది. నిరంతరం ఆ క్షతగాత్రులకు సేవలందించేందుకు దీపం పట్టుకొని శిబిరాల్లో తిరిగేది. దీంతో ఆమెను లేడీ విత్ ది ల్యాంప్ అని పిలిచేవారు. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్ (ఐసిఎన్) – 1965 నుంచి ఈ రోజును జరుపుకుంటున్నారు. ఆమె చేసిన త్యాగపూరితమైన కృషి ఫలితంగా నేడు నర్సు వృత్తి కొనసాగటమే కాదు, వైద్యరంగానికి వన్నెతెచ్చింది. ఆమె పుట్టిన రోజు సందర్భంగా అంతర్జాతీయ నర్సు దినోత్సవం జరుపుకుంటారు. -
మానవతామూర్తులు – నర్సులు
ఫ్లోరెన్స్ నైటింగేల్ రోగుల సపర్యల నిమిత్తం కొత్త ఒరవడిని సృష్టించిన వ్యక్తి. ఎలాంటి సౌకర్యాలూ లేని రోజుల్లో, చేతిలో దీపంతో క్షతగాత్రులకు ప్రేమతో పరిచర్యలు చేసిన మానవతామూర్తి. ప్రపంచంలోనే తొలి నర్సింగ్ స్కూల్ స్థాపించింది. ఆమె జన్మించి నేటికి 200 సంవత్సరాలు. ప్రతి ఏడాది ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టినరోజైన మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా ప్రపంచ వ్యాప్తంగా ఒక పండుగలా జరుపుకుంటారు. ఇప్పుడు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టేందుకు నర్సులు అహోరాత్రులు శ్రమిస్తున్నారు. బాధితులకు చికిత్స సంరక్షణను అందిస్తున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి కంటికి కనిపించని వైరస్‌తో యుద్ధం చేస్తున్నారు. ఈ విపత్కర సమయంలో నర్సుల సేవలకు వెలకట్టలేం. కుటుంబాలను, తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పని చేస్తున్నారు. కానీ, ఇప్పటికీ కొన్ని కాలనీలలో వారిని అనుమానంగా చూస్తూ వారిని అపార్ట్మెంట్లలోకి, కాలనీలలోకి రానివ్వడం లేదు. కొన్నిసార్లు మాత్రం కొన్ని ప్రదేశాల్లో పూలు జల్లి స్వాగతం పలుకుతున్నారు. మన సైన్యం కూడా కరోనా వైద్యం అందిస్తున్న వైద్య సిబ్బందిపై హెలికాఫ్టర్లతో హాస్పిటల్స్ ప్రాంతాలలో పూలు జల్లి వారికి మన అందరి తరపున కృతజ్ఞతలు తెలిపారు. వారి సేవలకు పూలు జల్లడమే కాదు వారి జీవితాలకు భరోసా ఇవ్వగలగాలి. వారికీ సహకరించి, మద్దతుగా నిలబడటం మన కనీస ధర్మం. వీరి సేవలకు గుర్తింపు తీసుకురావడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘నర్సులకు, ప్రసూతి ఆయాలకు మద్దతుగా నిలవాలనే‘ నినాదం ఈ సంవత్సరం తీసుకున్నది. ప్రజల ఆరోగ్యం కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవాదృక్పథంతో తమ విధులు నిర్వహిస్తున్న నర్సులందరికి కృతజ్ఞతలు తెలుపుకోవడం మన బాధ్యత. నర్సులను గౌరవిద్దాం. ఆస్పత్రులలోని అమ్మలూ మీకు వందనం. (నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం, నైటింగేల్ 200 జయంతి) పుల్లూరు వేణుగోపాల్, మొబైల్ 97010 47002 -
'నర్సుల డెరైక్టరేట్‌ను ఏర్పాటు చేస్తాం'
సుల్తాన్‌బజార్: తెలంగాణలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న వెయ్యి నర్సుల పోస్టులను భర్తీ చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం కోఠిలోని ఐఎంఏ ఆడిటోరియంలో తెలంగాణ రాష్ట్ర నర్సుల అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి లక్ష్మారెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... వైద్య రంగంలో నర్సుల పాత్ర కీలకమైందన్నారు. నర్సుల డెరైక్టరేట్‌ను ఏర్పాటు చేస్తామని, కాంట్రాక్ట్ నర్సులను పర్మినెంట్ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. నర్సింగ్కు సంబంధించి స్పెషలైజేషన్ కోర్సులను ప్రవేశపెడతామని చెప్పారు.