ప్రధాని దిష్టిబొమ్మ దహనం | NSUI leaders burning of the pm modi effigy in nizamabad district over petrol prices increasing | Sakshi
Sakshi News home page

ప్రధాని దిష్టిబొమ్మ దహనం

Apr 5 2016 4:40 PM | Updated on Aug 15 2018 6:32 PM

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ నిజామాబాద్ జిల్లాలో ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు.

నిజామాబాద్ : కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ నిజామాబాద్ జిల్లాలో ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. డిచ్‌పల్లి తెలంగాణ యూనివర్శిటీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. వరుసగా పెట్రోలు ధరలు పెంచడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు చెప్పారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement