ఇన్‌ఫెక్షన్లకు కొత్త చికిత్స

New Treatment For Fungal Infections By Dr Mudrika Khandelwal - Sakshi

సంగారెడ్డి టౌన్‌: ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ చికిత్స కోసం ఐఐటీ హైదరాబాద్‌ పరిశోధకులు ఎసెన్షియల్‌ ఆయిల్‌ బేస్డ్‌ డ్రగ్‌ డెలివరీ సిస్టమ్‌ను అభివృద్ధి చేశారు. దీని ద్వారా ఇన్‌ఫెక్షన్‌కు ట్రీట్‌మెంట్‌ చేయవచ్చని మెటలర్జికల్‌ ఇంజనీరింగ్‌ విభాగం అసోసియేటెడ్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ముద్రికా ఖండేల్వాల్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. తమ పరిశోధనకు కేంద్ర ప్రభుత్వ సంస్థ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ రీసెర్చ్‌ బోర్డు ఆర్థిక సాయం చేసింద న్నారు. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ కింద అమెరికన్‌ మల్టీనేషనల్‌ కాంగ్లోమెరేట్‌ ఏటీఅండ్‌టీ సాయం చేసిందన్నారు. యాంటీఫంగల్‌ ఫ్యాంటీ లైనర్లను అభివృద్ధి చేసి చర్మంపై ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌లకు కారణమయ్యే శిలీంధ్రాల నిర్మూలనకు పరిశోధనలు చేస్తున్నామన్నారు. తమ పరిశోధన పత్రానికి కోఆథర్‌గా పీహెచ్‌డీ విద్యార్థిని శివకల్యాణి ఉన్నారని, ఈ పత్రాన్ని అంతర్జాతీయ జర్నల్‌ మెటెరియేలియాలో ప్రచురితమైందన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top