వైద్యానికి వెళ్తే అత్యాచారం చేశాడు.. | necromancer raped a 17years old girl | Sakshi
Sakshi News home page

వైద్యానికి వెళ్తే అత్యాచారం చేశాడు..

Mar 7 2017 4:24 PM | Updated on Jul 28 2018 8:53 PM

రోగం నయం చేస్తానంటూ ఓ నాటు వైద్యుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

హైదరాబాద్‌: రోగం నయం చేస్తానంటూ ఓ నాటు వైద్యుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే బహదూర్‌పురాకు చెందిన అహ్మద్‌(45)కి మంత్ర వైద్యుడిగా ఈ ప్రాంతంలో పేరుంది. అనారోగ్యం పాలైన ఓ బాలిక(17)ను అహ్మద్‌ దగ్గరకు తల్లిదండ్రులు తీసుకువచ్చి వ్యాధి నయం చేయాలని కోరారు. ఇందుకు అంగీకరించిన అహ్మద్‌ కొన్ని రోజులుగా వైద్యం చేస్తున్నాడు.

ఈ నేపథ్యంలోనే సోమవారం సాయంత్రం తన వద్దకు వచ్చిన బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన బాలిక కుటుంబసభ్యులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అహ్మద్‌పై కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు ప్రారంభించామని, ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని ఇన్‌స్పెక్టర్‌ గురు నాయుడు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement