పాలిటెక్నిక్ విద్యార్థిని ఆత్మహత్య..? | Mysterious death of a Polytechnic student | Sakshi
Sakshi News home page

పాలిటెక్నిక్ విద్యార్థిని ఆత్మహత్య..?

Oct 29 2015 3:32 PM | Updated on Nov 9 2018 5:02 PM

పాలిటెక్నిక్ చదువుతున్న ఓ విద్యార్థిని అనుమానాస్పదంగా మృతిచెందిన సంఘటన కరీంనగర్ జిల్లా ముత్తారం మండలం ఆదివారంపేటలో గురువారం చోటుచేసుకుంది.

పాలిటెక్నిక్ చదువుతున్న ఓ విద్యార్థిని అనుమానాస్పదంగా మృతిచెందిన సంఘటన కరీంనగర్ జిల్లా ముత్తారం మండలం ఆదివారంపేటలో గురువారం చోటుచేసుకుంది.  గ్రామానికి చెందిన వేల్పుల శ్యామల(17) కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇటీవల దసరా సెలవుల కోసం ఇంటికి వచ్చింది. గురువారం కళాశాలలో పరీక్ష ఉందని యాజమాన్యం సమాచారం అందించడంతో.. కళాశాలకు వెళ్లడానికి సిధ్దమైంది.


కానీ.. అనూహ్యంగా.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఇంట్లో ఎవరూ లేరని.. కుటుంబ సభ్యులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియ రాలేదు.  సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement