ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన కార్మికులు | muncipal workers dharna at medchal | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన కార్మికులు

Jul 28 2015 1:50 PM | Updated on Oct 16 2018 6:35 PM

తమ డిమాండ్ల పరిష్కారించాలని పారిశుద్ధ్య కార్మికులు మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి నివాసాన్ని ముట్టడించారు.

ఘట్‌కేసర్: తమ డిమాండ్ల పరిష్కారించాలని పారిశుద్ధ్య కార్మికులు మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి నివాసాన్ని ముట్టడించారు. సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో సుమారు రెండు వేల మంది కార్మికులు మంగళవారం రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండలం ప్రతాప్ సింగారంలో ఉన్న ఎమ్మెల్యే నివాసాన్ని ముట్టడించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వేతనాలు పెంపు సహా తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దీంతో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement