... అందుకే రాజయ్యపై వేటు వేశారు | Motkupalli Narasimhulu takes on Telangana cm KCR | Sakshi
Sakshi News home page

... అందుకే రాజయ్యపై వేటు వేశారు

Jan 27 2015 1:52 PM | Updated on Aug 15 2018 9:27 PM

... అందుకే రాజయ్యపై వేటు వేశారు - Sakshi

... అందుకే రాజయ్యపై వేటు వేశారు

టి.రాజయ్యను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయడం ద్వారా మాదిగల ఆత్మగౌరవాన్ని తెలంగణ సీఎం కేసీఆర్ దెబ్బతీశారని టీటీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు.

హైదరాబాద్: టి.రాజయ్యను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయడం ద్వారా మాదిగల ఆత్మగౌరవాన్ని తెలంగణ సీఎం కేసీఆర్ దెబ్బతీశారని టీటీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్లో సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరిపై మోత్కుపల్లి నిప్పులు చెరిగారు. తెలంగాణ కోసం ఆత్మబలిదానాల చేసుకుంది దళితులు కాదా ?.... మాదిక కులస్థులకు కేబినెట్లో ఎందుకు అవకాశం కల్పించలేదని ఆయన కేసీఆర్ను సూటిగా ప్రశ్నించారు. 

కేసీఆర్కు తెలియకుండా హెల్త్ యూనివర్శిటీపై ప్రకటన చేసినందుకే రాజయ్యపై వేటు వేశారిని విమర్శించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మంచి తీరు కనబరిచారంటూ రాజయ్యకు మోత్కుపల్లి కితాబు ఇచ్చారు. తన చేతిలో ఉన్న శాఖలకు ఎంతవరకు న్యాయం చేశారో వెల్లడించాలని సీఎం కేసీఆర్కు మోత్కుపల్లి సవాల్ ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement