లాఠీచార్జ్‌లో ఎమ్మెల్యే రాజాసింగ్‌కు గాయాలు!

MLA Raja singh injured in Police Lotty Charge in Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పోలీసుల లాఠీచార్జ్‌లో ఎమ్మెల్యే రాజాసింగ్‌కు గాయాలు అయినట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని జుమ్మెరాత్ బజార్‌లోని స్వాతంత్ర్య సమరయోధురాలు రాణి అవంతి భాయ్ విగ్రహ ప్రతిష్టాపన చేసేందుకు బుధవారం ఆర్థరాత్రి అక్కడి స్థానికులు ప్రయత్నించారు. అయితే విగ్రహానికి ప్రభుత్వ అనుమతి లేదని గోషామహాల్ పోలీసులు వారిని అడ్డుకున్నారు. స్థానికులకు మద్దతుగా ఎమ్మెల్యే రాజాసింగ్ సంఘటన స్థలానికి వచ్చారు. 

రాజాసింగ్ వచ్చిన అనంతరం అప్పటికే పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు వారిపై రాళ్లు రువ్వారు. అయితే వీరిని చెదరగొట్టే ప్రయత్నంలో పోలీసులు లాఠీచార్జీ చేశారని, రాజాసింగ్‌తోపాటు పలువురుకి గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. దీంతో వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా అక్రమంగా లాఠీచార్జీ చేశారని పోలీసులపై ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. ఒక స్వాతంత్ర్య సమరయోధురాలి విగ్రహ ప్రతిష్టాపనను అడ్డుకోవడం అరాచకమని నిప్పులు చెరిగారు. ఈఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

మరోవైపు రాజాసింగ్‌పై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు బీజేపీ తెలంగాణ విభాగం ట్విటర్‌లో పేర్కొంది. తెలంగాణలో టీఆర్ఎస్ నిరంకుశ, నియంతృత్వ, అరాచక పాలన పరాకాష్టకు చేరిందని స్పష్టమవుతోందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top