'చేసిన తప్పులను ఒప్పుకోవాలి' | mla beegala ganesh slams chandrababu naidu | Sakshi
Sakshi News home page

'చేసిన తప్పులను ఒప్పుకోవాలి'

Jun 8 2015 1:33 PM | Updated on Aug 17 2018 12:56 PM

ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు చేసిన తప్పులను ఒప్పుకుని వెంటనే కోర్టు ముందు లొంగిపోవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బిగాల గణేష్ వ్యాఖ్యానించారు.

హైదరాబాద్:  ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు చేసిన తప్పులను ఒప్పుకుని వెంటనే కోర్టు ముందు లొంగిపోవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బిగాల గణేష్ వ్యాఖ్యానించారు. స్వయంగ చంద్రబాబే ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతున్నట్టు రుజువైందన్నారు. ఆడియో టేపులు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని ఆయన తెలిపారు. ఆడియో టేపులపై అనుమానాలు ఉంటే ఎలాంటి పరీక్షలైనా చేసుకోవచ్చని గణేష్ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement