బాలికపై అత్యాచారం | Minor raped | Sakshi
Sakshi News home page

బాలికపై అత్యాచారం

Aug 1 2015 6:59 PM | Updated on Jul 28 2018 8:51 PM

ఓ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన వరంగల్ జిల్లా నర్మెట్ట మండలంలో శనివారం వెలుగులోకి వచ్చింది.

నర్మెట్ట (వరంగల్) : ఓ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన వరంగల్ జిల్లా నర్మెట్ట మండలంలో శనివారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రానికి చెందిన బాలిక(16) ఇంటర్ రెండవ ఏడాది చదువుతుంది. బాలికకు దూరపు బంధువు అయిన మేకా రమేష్(22) ప్రేమ పేరుతో తరచుగా నర్మెట్ట వస్తూ ఉండేవాడు.

ఈ క్రమంలోనే గత నెలలో బాలికను రంగారెడ్డి జిల్లా చిలుకూరు తీసుకెళ్లాడు. అక్కడే ఆమెపై ఆత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు తెలపడంతో వారు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లాలోని స్టేషన్ ఘన్‌పూర్ మండలానికి చెందిన రమేష్‌ ఈ నెలలో మరో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైనట్లు బాలిక పోలీసులకు తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement