సొంతింటి కల నెరవేరుస్తున్నాం

minister pocharam told about double bed room scheme - Sakshi

మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి

నస్రుల్లాబాద్‌: నిరు పేదల సొంతిటి కలను సీఎం కేసీఆర్‌ నెర వేరుస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. సోమవారం అంకోల్‌ క్యాంపులో 26 ఇళ్ల నిర్మాణానికి  భూమిపూజ చేశారు. ఆయన మాట్లాడుతూ పని మొదలు కొన్న రోజునుండి దశల వారిగా నిధులను అందిస్థామన్నారు. పని పూర్తి అయిన 48 గంటలలో ఖాతాలలో డబ్బులు వేస్తామన్నారు. గత పాలకులు సంత్సరాల సమయం తీసుకుని రూ.90వేలతో రెండు గదుల ఇళ్లను అగ్గి పెట్టెల్లా నిర్మించి ఇచ్చేవారన్నారు. అటువంటి రాష్ట్ర ప్రజలకు ఆరు నెలల గడువులోగా డబుల్‌ బెడ్రూం ఇళ్లను నిర్మించడం ఒక మహత్తర కార్యం అని అన్నారు.

నిరంతర విద్యుత్తు, అందరికి ఆసరా, ఆలంబనా, చేయుత పేరిట పెంన్షన్‌లు, రేషన్, రోడ్లు, ఉచిత మినిరల్‌ వాటర్, మిషన్‌ కాకతీయ మొదలగు సంక్షేమ పథకాలను అమలు పరచడంలో ఆయనకు సాటి ఎవరు లేరన్నారు. రాష్ట్ర ప్రజలను కన్న బిడ్డల్లా, కంటికి రెప్పలా కాపాడు కుంటున్నారన్నారు. కార్యక్రమంలోఎంపీపీ మల్లెల మీనా, జెడ్పీటీసీ కిషన్‌ నాయక్, మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు ప్రభాకర్‌ రెడ్డి, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కంది మల్లేష్, సర్పంచ్‌ దిపికా కిరణ్‌ గౌడ్, ఎంపీటీసీ సుమలత శ్రీనివాస్, ఎంఆర్‌వో సంజయ్‌ రావు, ఎంపీడీవో భరత్‌ కుమార్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top