రాష్ట్రపతిని కలిసిన కేటీఆర్  | minister ktr meets president ramnath kovind in delhi | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతిని కలిసిన కేటీఆర్ 

Feb 9 2018 12:10 PM | Updated on Sep 4 2018 5:37 PM

minister ktr meets president ramnath kovind in delhi - Sakshi

రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ శుక్రవారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో భేటీ అయ్యారు.

సాక్షి, ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ శుక్రవారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఈ నెల 19 నుంచి 21 వరకు జరుగనున్న వరల్డ్‌ ఐటీ కాంగ్రెస్‌ 2018 సదస్సు ముగింపు వేడుకలకు రావాలని రాష్ట్రపతిని కేటీఆర్‌ ఆహ్వానించారు.

కాగా, నాస్కామ్‌ ఆధ్వర్యంలో జరుగనున్న ఐటీ కాంగ్రెస్‌ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ వీడియో లింక్‌ ద్వారా ప్రారంభించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 150 మంది పారిశ్రామిక వేత్తలు ఈ సదస్సులో పాల్గొననున్నారు. మొత్తం 50 సెషన్లు జరగనున్నాయి. 30 దేశాల నుంచి ప్రతినిధులు రానున్న ఈ సదస్సులో మొత్తం 50 సెషన్లు జరుగుతాయి. 

Advertisement
 
Advertisement
Advertisement