‘సీఎం కేసీఆర్‌ కూడా చికెన్‌ తింటారు’

Minister KTR Comments On Covid 19 And  Poultry Crisis - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సంక్షోభంలో ఉన్న పౌల్ట్రీ పరిశ్రమకు ప్రభుత్వం అండగా ఉంటుందని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. చికెన్‌ తింటే కరోనా వైరస్‌ సోకుతుందనే అసత్య వార్తల్ని నమ్మొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సహా తన కుటుంబమంతా చికెన్‌ తింటున్నామని, ఎప్పుడూ ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తలేదని చెప్పారు.

చికెన్ తింటే కరోనా వైరస్ వస్తుందనే ఆసత్య ప్రచారాలను తిప్పికొంట్టేందుకు నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన చికెన్ ఎగ్స్ మేళాను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు ఈటల రాజేందర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, పలువురు అధికారులు, పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులు, సినీ నటి రష్మిక మంధాన పాల్గొన్నారు. చికెన్‌ ఒక ప్రొటీన్‌ ఆహారమని.. దానికీ కరోనా వైరస్‌కు సంబంధం లేదని రష్మిక పేర్కొన్నారు. చికెన్‌ ఆరోగ్యానికి మంచిదని చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top