నిర్మల్‌ బస్టాండ్‌లో మంత్రి తనిఖీ  | minister inspects bus stands | Sakshi
Sakshi News home page

నిర్మల్‌ బస్టాండ్‌లో మంత్రి తనిఖీ 

Jan 29 2018 4:33 PM | Updated on Jan 29 2018 4:33 PM

minister inspects bus stands - Sakshi

బస్టాండ్‌లోని హోటల్‌ను పరిశీలిస్తున్న మంత్రి ఐకేరెడ్డి 


నిర్మల్‌టౌన్‌ : ∙నిర్మల్‌ ఆర్టీసీ బస్టాండ్‌ను ఆదివారం రాష్ట మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తనిఖీ చేశారు. సౌకర్యాలపై ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. బస్సు సర్వీసుల సేవలపై ఆరా తీశారు. బస్సుల వేళల్లో సిబ్బంది సమయపాలన పాటిస్తున్నారా? అని ప్రయాణికులను అడిగారు. ప్రయాణికులు తమ సమస్యలు మంత్రి ఐకేరెడ్డి దృష్టికి తీసుకురాగా, తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నాయకులు అప్పాల గణేశ్, ముత్యంరెడ్డి, పాకాల రాంచందర్, కౌన్సిలర్‌ నేల్ల అరుణ్, తోట నర్సయ్య తదితరులున్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement