'చారిత్రక దేవాలయాలను అభివృద్ధి చేస్తాం' | minister Indrakaran Reddy says Govt should develops Old Temples also | Sakshi
Sakshi News home page

'చారిత్రక దేవాలయాలను అభివృద్ధి చేస్తాం'

Feb 14 2016 4:42 PM | Updated on Aug 11 2018 4:59 PM

తెలంగాణలోని చారిత్రక దేవాలయాలను అభివృద్ధి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.

రంగారెడ్డి జిల్లా: తెలంగాణలోని చారిత్రక దేవాలయాలను అభివృద్ధి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఆదివారం  మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో జరిగిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి కల్యాణ మహోత్సవానికి మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ... మేడారం జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేశామని చెప్పారు. భవిష్యత్తులోనూ ఘనంగా నిర్వహించేందుకు చర్యలు చేపడతామన్నారు. రాఘవాపూర్ గ్రామంలో సబ్‌స్టేషన్ నిర్మాణ పనులను మంత్రి మహేందర్‌రెడ్డి ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement