50 ఎకరాలు అమ్ముకున్న మంత్రి ఎర్రబెల్లి

Minister Errabelli, Who Sold 50 Acres of Land - Sakshi

కొడకండ్ల : రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తమ కుటుంబానికి సంబంధించిన 50 ఎకరాల భూమిని విక్రయించారు. ఈ మేరకు భూమి కొనుగోలు చేసిన వారికి రిజిస్ట్రేషన్‌ చేసేందుకు జనగామ జిల్లా కొడకండ్లలోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి సోమవారం వచ్చారు. పాలకుర్తి మండలం చెన్నూరులోని తన పేరిట ఉన్న భూమిని విక్రయించిన మంత్రి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి రాగా.. సబ్‌రిజిస్ట్రార్‌ విజయజ్యోతి, ఉద్యోగులు ఆయనను సన్మానించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top