మూడేళ్ల తర్వాత అన్నం ముద్ద | Meal after Three years | Sakshi
Sakshi News home page

మూడేళ్ల తర్వాత అన్నం ముద్ద

Feb 10 2018 2:09 AM | Updated on Feb 10 2018 10:34 AM

Meal after Three years - Sakshi

సోదరి, స్నేహితురాలితో డాక్టర్‌ అర్పిత (మధ్య)

వేములవాడ: వేములవాడ రాజన్ననే నమ్ముకుని మూడేళ్లపాటు అన్నం ముట్టకుండా దీక్ష చేపట్టిన డాక్టర్‌ (డెంటల్‌) అనుమోలు అర్పిత శుక్రవారం దీక్షను విరమించారు. ఏపీలోని కృష్ణాజిల్లా తిరువూరులో ప్రాక్టీస్‌ చేస్తున్న అర్పిత.. వేములవాడ రాజన్నకు అన్నపూజ నిర్వహించిన అనంతరమే దీక్ష విరమిస్తానని మూడేళ్ల క్రితం మొక్కుకున్నట్లు చెప్పారు.

శుక్రవారం సోదరి అపర్ణ, స్నేహితురాలు మంజులతో కలసి వేములవాడకు వచ్చారు. స్వామివారికి అన్నపూజ నిర్వహించిన తర్వాత భోజనం చేశారు. తన కుటుంబం బాగుకోసం రాజన్నకు మొక్కుకుని దీక్ష చేపట్టినట్లు చెప్పారు. మూడేళ్లపాటు పండ్లు, ఇతర పదార్థాలు స్వీకరించినట్లు తెలిపారు. తిరువూరులోనే పిల్లల వైద్యులుగా విధులు నిర్వహిస్తున్న తన భర్త నాగభూషణం, ఇద్దరు కుమారులు అఖిల్‌రాజు, ఆకాశ్‌ సైతం తన దీక్షకు మద్దతు ప్రకటించారని ఆమె సంతోషంగా చెబుతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement