రైలు కింద పడి ఎంసీఏ విద్యార్థి మృతి | mca student commited suicide in warangal | Sakshi
Sakshi News home page

రైలు కింద పడి ఎంసీఏ విద్యార్థి మృతి

Jan 29 2015 5:49 PM | Updated on Sep 2 2017 8:29 PM

వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి బోడ శ్రీనివాస్(25) అనే ఎంసీఏ విద్యార్థి మృతి చెందాడు.

వరంగల్: వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి బోడ శ్రీనివాస్(25) అనే ఎంసీఏ విద్యార్థి మృతి చెందాడు. మృతుడు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థిగా గుర్తించారు. చనిపోయిన ప్రదేశంలో ఎటువంటి సూసైడ్ నోట్ దొరక్కపోవడంతో ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

శ్రీనివాస్ సొంతూరు మంగంపేట మండలం నర్సాపూర్ గ్రామం. తండ్రి చాన్నాళ్ల కిందే చనిపోయాడు. తల్లి టైలరింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. ఒక్కగానొక్క కొడుకు చనిపోవటంతో ఆ కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది.

Advertisement
 
Advertisement
Advertisement