చర్లలో మిలీషియా కమాండర్ అరెస్టు | maoist militia commander arrested in khammam district | Sakshi
Sakshi News home page

చర్లలో మిలీషియా కమాండర్ అరెస్టు

Feb 13 2016 1:52 PM | Updated on Oct 9 2018 2:47 PM

మావోయిస్టు మిలీషియా కమాండర్ ఒకరు పోలీసులకు పట్టుబడ్డారు.

చర్ల: మావోయిస్టు మిలీషియా కమాండర్ ఒకరు పోలీసులకు పట్టుబడ్డారు. చర్ల మండలం కుర్గట్‌పాడ్ అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం కూంబింగ్ చేపట్టిన కోబ్రా, సీఆర్పీఎఫ్ బలగాలకు మావోయిస్టులు తారసపడగా పోలీసులు వారిని వెంబడించారు. వారిలో పట్టుబడిన ఒకరిని చర్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించి, విచారణ చేపట్టారు. పట్టుబడిన వ్యక్తి చర్ల ఏరియా మిలీషియా కమాండర్ సోడి మూక అలియాస్ మూకయ్యగా తేలటంతో అతడిని భద్రాచలం కోర్టు ఎదుట హాజరుపరిచామని సీఐ సాయిరమణ, ఎస్సై రవీందర్ తెలిపారు. మూకయ్యపై సెల్‌టవర్ పేల్చివేత, ల్యాండ్‌మైన్ల ఏర్పాటు, ఒక వ్యక్తి హత్య కేసులు ఉన్నాయని వారు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement