సెల్‌ చార్జింగ్ పెడుతూ యువకుడు మృతి | man dies while charging cell phone | Sakshi
Sakshi News home page

సెల్‌ చార్జింగ్ పెడుతూ యువకుడు మృతి

Jan 16 2016 6:24 PM | Updated on Oct 9 2018 5:43 PM

సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ.. విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు మృతిచెందిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండలం తారాపురం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది.

గట్టు (మహబూబ్‌నగర్) : సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ.. విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు మృతిచెందిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండలం తారాపురం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కావలి ఆంజనేయులు(28) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో శనివారం సెల్‌ఫోన్ చార్జింగ్ పెట్టడానికి ప్రయత్నిస్తూ.. విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని  దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement