లారీ ఢీకొని వ్యక్తి మృతి | Man dies in road accident | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని వ్యక్తి మృతి

Nov 17 2015 3:47 PM | Updated on Aug 30 2018 3:56 PM

ఇటుకల లోడ్‌తో వెళుతున్న టాటా మ్యాజిక్ వాహనాన్ని ఓ లారీ ఢీకొనగా వ్యాపారి దుర్మరణం పాలయ్యాడు.

అశ్వారావుపేట (ఖమ్మం) : ఇటుకల లోడ్‌తో వెళుతున్న టాటా మ్యాజిక్ వాహనాన్ని ఓ లారీ ఢీకొనగా వ్యాపారి దుర్మరణం పాలయ్యాడు. ఖమ్మం జిల్లా ములకలపల్లి మండలం రాజాపురం వద్ద మంగళవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. మణుగూరు నుంచి ఓ వ్యాపారి ఇటుకలను తీసుకుని పశ్చిమగోదావరి జిల్లా విజయరాయికి వెళుతున్నాడు. రాజాపురం వద్ద ఓ లారీ టాటా మ్యాజిక్ వాహనాన్ని ఢీకొంది. దీంతో వాహనం నడుపుతున్న వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడగా... వ్యాపారి గోలెపు పొచ్చయ్య (30) తీవ్ర గాయాలతో వాహనంలోనే ఇరుక్కుపోయి ప్రాణాలు విడిచాడు.

Advertisement
 
Advertisement
Advertisement