డెంగీతో వ్యక్తి మృతి | man died Dengue fever | Sakshi
Sakshi News home page

డెంగీతో వ్యక్తి మృతి

Oct 6 2015 11:31 PM | Updated on Oct 9 2018 5:43 PM

డెంగీతో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన మండలంలోని హజారుగూడెంలో మంగళవారం వెలుగుచూసింది.

 హాలియా: డెంగీతో ఓ వ్యక్తి మృతిచెందాడు.  ఈ ఘటన  మండలంలోని హజారుగూడెంలో మంగళవారం వెలుగుచూసింది. వివరాలు.. గ్రామానికి చెందిన పెరుమాళ్ల సైదయ్య(53) పది రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్‌లోని ఓ  ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి నిమ్స్‌కు తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ సైదయ్య  సోమవారం మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం  ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement