బ్యాంకులో కలకలం: ఉన్మాది వీరంగం | Man attacked on Andhra Bank staff in Nalgonda District | Sakshi
Sakshi News home page

బ్యాంకులో కలకలం: ఉన్మాది వీరంగం

Nov 21 2017 7:21 PM | Updated on Oct 9 2018 5:39 PM

Man attacked on Andhra Bank staff in Nalgonda District - Sakshi

సాక్షి, నిడమనూరు: బ్యాంకులో రుణం కోసం వచ్చిన వ్యక్తి ఉన్మాదిగా ప్రవర్తించిన ఘటన నల్లగొండ జిల్లాలో కలకలం రేపింది. నిడమనూరు మండలం తుమ్మడంలో ఓ వ్యక్తి లోన్‌ కోసం మంగళవారం ఆంధ్రా బ్యాంకుకు వచ్చాడు. కొంతసేపటి తర్వాత అతడు ఉన్మాదిలా ప్రవర్తించి బ్యాంకు సిబ్బందిపై దాడికి దిగాడు. బ్యాంకులోని సామాగ్రిని ధ్వంసం చేశాడు. పత్రాలను చిందవందరగా పడేసి వీరంగం సృష్టించాడు.

చివరికి అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దాడిలో గాయపడ్డిన బ్యాంకు సిబ్బందిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు దాడి చేశాడనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement