రాచరికాన్ని పూడ్చిన గడ్డ తెలంగాణ | Mallu swarajyam commented over cm KCR | Sakshi
Sakshi News home page

రాచరికాన్ని పూడ్చిన గడ్డ తెలంగాణ

Apr 26 2017 1:29 AM | Updated on Aug 15 2018 9:37 PM

రాచరికాన్ని పూడ్చిన గడ్డ తెలంగాణ - Sakshi

రాచరికాన్ని పూడ్చిన గడ్డ తెలంగాణ

సీఎం కేసీఆర్‌ రాచరి కాన్ని మళ్లీ తేవాలనుకుంటే అది ఆయన వల్ల కాదని, రాచరికాన్ని, తానీషాలనే పూడ్చి పెట్టిన ఘనత తెలంగాణదని సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం అ న్నారు.

మల్లు స్వరాజ్యం
సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ రాచరి కాన్ని మళ్లీ తేవాలనుకుంటే అది ఆయన వల్ల కాదని, రాచరికాన్ని, తానీషాలనే పూడ్చి పెట్టిన ఘనత తెలంగాణదని సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం అ న్నారు. కేసీఆర్‌కు ప్రగతిభవన్‌ ఎంత ముఖ్య మో.. తెలంగాణ ప్రజలకు ధర్నాచౌక్‌ కూడా అంతే ముఖ్యమన్నారు. సేవ్‌ధర్నాచౌక్‌ పేరు తో మఖ్థూం భవన్‌ వద్ద నిర్వహిస్తున్న రిలే నిరసన దీక్షలు 11వ రోజుకు చేరుకు న్నాయి. మంగళవారం దీక్షలో ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ, వర్కింగ్‌ ఉమెన్స్‌ ఫోరం, పీఓడబ్ల్యూ స్త్రీ విముక్తి, మహిళా రైతు హక్కుల వేదిక, ప్రగతిశీల మహిళా సంఘం, నేషనల్‌ అల యన్స్‌ ఫర్‌ పీపుల్‌ మూమెంట్‌ సంఘాలు పాల్గొన్నాయి.

ఇందులో మల్లు స్వరాజ్యం మాట్లాడుతూ... ధర్నాచౌక్‌ను ఎత్తివేసి సీఎం కేసీఆర్‌ తప్పు చేస్తున్నారన్నారు. విద్యావేత్త ప్రొఫెసర్‌ రమా మేల్కొటే మాట్లాడుతూ... అభివృద్ధి అంటే ప్రజల హక్కులను కాలరా యడం, భూములను లాక్కోవడమేనా అని ప్రశ్నించారు. టీజేఏసీ నాయకులు ప్రభాకర్‌ రెడ్డి, సామాజిక కార్యకర్త దేవి, ధర్నాచౌక్‌ పరిరక్షణ కమిటీ సభ్యులు మల్లెపల్లి ఆదిరెడ్డి, ఐద్వా నాయకురాలు జ్యోతి, సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ నాయకులు కె.గోవర్దన్, అంకురం సంస్థ ప్రతినిధి సుమిత్ర తదిత రులు పాల్గొని ప్రసంగించారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement