షార్జాలో మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలు

Mahatma Gandhi 150th Birthday Celebrations In Sharjah Dubai - Sakshi

గల్ఫ్‌ : షార్జాలో ఇండియన్‌ పీపుల్స్‌ ఫోరం ఆధ్వర్యంలో బుధవారం రాత్రి మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విదేశాంగ శాఖ మంత్రి మురళీధరన్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. షార్జాలోని ఇండియన్‌ అసోసియేషన్‌ ఆడిటోరియంలో నిర్వహించిన ఉత్సవాల్లో కాన్సుల్‌ జనరల్‌ విపుల్, ఇండియన్‌ పీపుల్స్‌ ఫోరం జాతీయ కన్వీనర్‌ భూపేందర్, ఉపాధ్యక్షుడు జనగామ శ్రీనివాస్, సభ్యులు రమేష్, మహేందర్‌రెడ్డి, బాలకిషన్, గిరీష్‌ పంత్, విజయ్, ఐపీఎఫ్‌ అల్‌ ఎమిరేట్స్‌ సభ్యులు, ఇండియన్‌ కమిటీ సభ్యులు, ఇండియన్‌ అసోసియేషన్‌ షార్జా సభ్యులు, ఎన్‌ఆర్‌ఐలు పాల్గొన్నారు. కాగా, గల్ఫ్‌ దేశాల్లో తెలంగాణ కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై బీజేపీ ఎన్‌ఆర్‌ఐ సెల్‌ యూఏఈ కన్వీనర్‌ వంశీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top