నెత్తురోడుతున్న రోడ్లు,10మంది దుర్మరణం | Lorry hits Auto: 14 Killed in Mahabubnagar district | Sakshi
Sakshi News home page

నెత్తురోడుతున్న రోడ్లు,10మంది దుర్మరణం

Aug 20 2014 12:05 PM | Updated on Aug 30 2018 3:58 PM

తెలంగాణలో రహదారులు నెత్తురోడుతున్నాయి. రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో తొమ్మిది మంది దుర్మరణం చెందారు.

మహబూబ్‌నగర్ : తెలంగాణలో రహదారులు నెత్తురోడుతున్నాయి. రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. మహబూబ్ నగర్ జిల్లా మాగనూరు సమీపంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్‌ బంక్‌ వద్ద ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద ధాటికి మృతదేహాలన్నీ చెల్లాచెదురయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు మక్తల్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆటో కృష్ణా గ్రామం నుంచి మక్తల్‌ వెళ్తుండగా ప్రమాదం సంభవించింది.

 

Advertisement
 
Advertisement
Advertisement