పరిహారం ఇవ్వలేదని.. | Land expats protest for Compensation in adilabad district | Sakshi
Sakshi News home page

పరిహారం ఇవ్వలేదని..

Apr 29 2016 9:39 AM | Updated on Sep 3 2017 11:03 PM

పరిహారం చెల్లింపులో జాప్యం చేస్తున్నారంటూ భూ నిర్వాసితులు సింగరేణి సంస్థకు చెందిన వాహనాలను ధ్వంసం చేశారు.

శ్రీరాంపూర్: పరిహారం చెల్లింపులో జాప్యం చేస్తున్నారంటూ భూ నిర్వాసితులు సింగరేణి సంస్థకు చెందిన వాహనాలను ధ్వంసం చేశారు. శుక్రవారం ఉదయం ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్ మండలం సింగపూర్ గ్రామంలో చోటు చేసుకుందీ ఘటన. గ్రామానికి చెందిన ఓపెన్ కాస్ట్ భూ నిర్వాసితులకు సింగరేణి సంస్థ పరిహారం చెల్లించలేదు. దీనికి తోడు అధికారులు గ్రామ సమీపంలో రోజుకొక చోట క్యాంపులు పెడుతూ ఓపెన్ కాస్ట్ తవ్వకాల కోసం సర్వేలు చేపడుతున్నారు. ఈ చర్యలతో ఆగ్రహం చెందిన గ్రామస్తులు ఈరోజు ఉదయం అక్కడికి వచ్చిన అధికారులకు చెందిన 5 వాహనాలను రాళ్లతో దాడి చేసి ధ్వంసం చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సద్దుమణిగించారు. గ్రామస్తులతో చర్చలు ప్రారంభించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement