కంటోన్మెంట్ స్థలం ఇవ్వండి | ktr meets rajnath singh on road extension works | Sakshi
Sakshi News home page

కంటోన్మెంట్ స్థలం ఇవ్వండి

Nov 22 2016 2:17 AM | Updated on Sep 4 2017 8:43 PM

కంటోన్మెంట్ స్థలం ఇవ్వండి

కంటోన్మెంట్ స్థలం ఇవ్వండి

హైదరాబాద్‌లో రోడ్ల విస్తరణ కోసం కేంద్ర రక్షణ శాఖ పరిధిలో ఉన్న కంటోన్మెంట్ స్థలాలను అప్పగించాలని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ఐటీ...

రోడ్ల విస్తరణ కోసం అప్పగించాలని
కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌కు కేటీఆర్ విజ్ఞప్తి
హైదరాబాద్, తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని విన్నపం

సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో రోడ్ల విస్తరణ కోసం కేంద్ర రక్షణ శాఖ పరిధిలో ఉన్న కంటోన్మెంట్ స్థలాలను అప్పగించాలని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ఐటీ, పురపాలక శాఖల మంత్రి కె.తారకరామా రావు విజ్ఞప్తి చేశారు. ఆ స్థలాలకు బదులుగా మరో చోట స్థలాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమని వివరించారు. సోమవా రం ఢిల్లీలో పర్యటించిన కేటీఆర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలసి రాజ్‌నాథ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విభజన చట్టంలోని అంశాలు, సమస్యాత్మక ప్రాంతా ల్లో రోడ్ల విస్తరణ తదితర అంశాలపై చర్చిం చారు. గ్రేటర్ హైదరాబాద్ నడిబొడ్డున కంటోన్మెంట్ ప్రాంతాల్లో ఉన్న రోడ్లు ఇరు కుగా ఉన్నాయని... వాటిని విస్తరిస్తే నగరం ఎంతో అభివృద్ధి చెందుతుందని కేంద్ర మంత్రికి వివరించారు.

రసూల్‌పురాలో కేంద్ర హోంశాఖకు చెందిన రెండెకరాలను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని కోరారు. దాని బదులుగా మరోచోట క్వార్టర్స్ నిర్మించి ఇస్తామన్నారు. రహదారుల విస్తరణ కోసం కంటోన్మెంట్ స్థలాలు ఇచ్చి తెలంగాణ అభి వృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దీం తోపాటు రాష్ట్రంలో మావోరుుస్టు ప్రభావిత జిల్లాలకు రూ.1,290కోట్లు ఇవ్వాలని.. రెండే ళ్లుగా ఈ నిధుల ప్రతిపాదనలు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అనంతరం తుమ్మలతో కలసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తమ విజ్ఞప్తుల పట్ల రాజ్‌నాథ్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. రాష్ట్రంలో 2,600 కిలోమీటర్ల రహదారుల ప్రతిపాదనలను ఆమోదించాలని కోరినట్లు తెలిపారు. యాదాద్రి, వరంగల్ రహదారి విస్తరణ పనుల ఆలస్యంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళతామన్నారు. కొత్తగూడెం, జగ్దల్‌పూర్ రహదారి పనులు వేగవంతం చేయాలని కోరతామన్నారు.

ఆస్ట్రేలియా హైకమిషనర్‌తో భేటీ
సోమవారం భారత్‌లో ఆస్ట్రేలియా హైకమి షనర్ హరీందర్ సిద్ధూతోనూ కేటీఆర్ సమావే శమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబ డులకు ఉన్న అవకాశాలను వివరించారు. డిసెంబర్‌లో మెల్ బోర్న్‌లో నిర్వహించే ఇండియా- ఆస్ట్రేలియా లీడర్‌షిప్ సదస్సు లో పాల్గొనాలని ఈ సందర్భంగా కేటీఆర్‌ను సిద్ధూ ఆహ్వానించారు. అలాగే పబ్లిక్ ఎఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడింట్‌తోను కేటీఆర్ సమావేశమై... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారి శ్రామిక విధానాల గురించి వివరించారు.

గోల్కొండ బ్రాండ్ ఔట్‌లెట్ ఏర్పాటు చేస్తాం
సాయంత్రం పార్టీ ఎంపీలతో కలసి ఢిల్లీలో జరుగుతున్న భారత వాణిజ్య మేళాలో కేటీఆర్ పాల్గొన్నారు. అక్కడి స్టాల్స్‌ను సందర్శించారు. చేర్యాల, నిర్మల్, పెంబర్తి, కరీంనగర్ చేనేత ఉత్పత్తులు, మిషన్ భగీరథ, ఇంటింటికీ ఇంటర్నెట్ వంటి పలు సంక్షేమ పథకాలను ప్రతిబింబిస్తూ డిజిటల్ తెలంగాణ థీమ్‌తో ఏర్పాటు చేసిన పెవిలియన్‌ను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఉత్పత్తులను గోల్కొండ బ్రాండ్‌గా ఢిల్లీలో ఔట్‌లెట్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలంగాణ అమలు చేస్తున్న పాలసీలను దేశంలోని ఇతర రాష్ట్రాలు ఆసక్తిగా గమనిస్తున్నాయన్నారు. పెద్దనోట్ల రద్దును తాము స్వాగతిస్తున్నామని, అరుుతే దీనితో సామాన్యులు ఎన్నో అవస్థలు ఎదుర్కొంటున్నారని వ్యాఖ్యానించారు. అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని సమావేశమై పరిష్కార మార్గాలను కనుగొనాలని సూచించారు. కేటీఆర్ వెంట పార్టీ ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, బాల్క సుమన్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, కొత్త ప్రభాకర్, సీతారాం నాయక్, బీబీ పాటిల్ ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement