కార్యకర్తలకు అండగా ఉంటాం | KTR Always Supports TRS Party Activists | Sakshi
Sakshi News home page

కార్యకర్తలకు అండగా ఉంటాం

Dec 13 2019 1:54 AM | Updated on Dec 13 2019 1:54 AM

KTR Always Supports TRS Party Activists - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పార్టీ కోసం పనిచేసే కార్యకర్తల కుటుంబాలకు నిరంతరం అండగా ఉంటామని టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. ప్రమాదవశాత్తు్త మరణించే కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలిచేందుకు రూ.11.21 కోట్లను బీమా సంస్థకు ప్రీమియంగా చెల్లించినట్లు తెలిపారు.

ఇటీవల వివిధ ప్రమాదాల్లో మరణించిన 22 మంది పార్టీ కార్యకర్తల కుటుంబాలకు గురువారం తెలంగాణ భవన్‌లో రూ.2 లక్షల చొప్పున బీమా పరిహారం చెక్కులను ఆయన అందజేశారు.  కాగా, తెలంగాణ భవన్‌ మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని కేటీఆర్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో మండలి సభ్యులు శ్రీనివాస్‌రెడ్డి, నవీన్‌రావు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement