ఏ నోటిఫికేషన్‌ ఇచ్చినా చిక్కులే | Ktr about jobs notification | Sakshi
Sakshi News home page

ఏ నోటిఫికేషన్‌ ఇచ్చినా చిక్కులే

Jun 3 2018 1:00 AM | Updated on Aug 21 2018 8:16 PM

Ktr about jobs notification - Sakshi

సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి నీళ్లు, నిధులు, నియామకాలే ప్రామాణికమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలీసుల శిక్షణ శిబిరంలో మంత్రి శనివారం మాట్లాడారు. ఉద్యోగుల ని యామకానికి రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నా యని తెలిపారు. ఏ నోటిఫికేషన్‌ ఇచ్చినా కోర్టుల ద్వారా న్యాయపరమైన చిక్కులు వస్తు న్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయినా వాటిని అధిగమించి నియామకాలు చేపడుతున్నట్లు తెలిపారు.

ఉద్యోగాల భర్తీలో పైరవీలకు తావు లేకుండా పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో 6 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారని, తెలంగాణ వచ్చాక నాలుగేళ్లలో 30 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు కేటీఆర్‌ వివరించారు. న్యాయపరమైన చిక్కులు లేకుంటే ఈ పాటికే 60 వేల ఉద్యోగాలు భర్తీ అయ్యేవన్నారు. రాష్ట్రంలో మూడున్నర లక్షల మంది ఉద్యోగులు ఉండగా ప్రైవేటు రంగంలో నాలుగేళ్లలో లక్షన్నర ఉద్యోగాలు కల్పించామని తెలిపారు.

నిరుద్యోగులు పోటీ పరీక్షల్లో సమర్ధత చాటుకుని ఉద్యోగాలు సాధించాలని మంత్రి కోరారు. తెలంగాణలో ఉద్యోగుల నియామకాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. తెలంగాణ టీ–సాట్‌ ద్వారా వైద్య, విద్య రంగాలకు సంబంధించి నిపుణ చానల్‌ ద్వారా ఉచితంగా నాణ్యమైన విద్యా విషయాలను నిరుద్యోగులకు అందిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలోని యువకులు ఈ చానల్‌ను వినియోగించుకోవాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement