'నీళ్ల కోసం ఆకాశం వైపు చూడనవసరం లేదు'

Koppula Eswar Visited SRSC Cannal In Jagtial - Sakshi

సాక్షి, జాగిత్యాల : జిల్లాలోని ఎస్సారెస్పీ కాలువలో పూడిక తీత పనులను మంత్రి కొప్పుల ఈశ్వర్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ధర్మపురి మండలం గాదెపెల్లిలో సీఎం కేసిఆర్ తీసుకుంటున్న నిర్ణయాలను స్వాగతిస్తూ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో రైతులు సన్నం రకం వడ్లను సాగు చేస్తామని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఆయన మాట్లాడుతూ.. వేసవిలోనూ మత్తడి దుంకడం కేసీఆర్ గొప్పతనానికి మారుపేరన్నారు. రైతులు ఇకపై నీళ్ల కోసం ఆకాశం వైపు చూడాల్సిన అవసరం లేదన్నారు. పుష్కలంగా నీళ్లు.. భూమి నిండా పంట ఉంటుదన్నారు. ​కాగా పంట మార్పిడిపై రైతుల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top