సీఎం కేసీఆర్ సీరియస్ | KCR reviews commercial taxes in nizamabad, serious on bodhan scam | Sakshi
Sakshi News home page

సీఎం కేసీఆర్ సీరియస్

May 16 2017 4:57 PM | Updated on Apr 3 2019 5:38 PM

సీఎం కేసీఆర్ సీరియస్ - Sakshi

సీఎం కేసీఆర్ సీరియస్

బోధన్ ఫోర్జరీ చలాన్ల ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ అయ్యారు.

బోధన్ ఫోర్జరీ చలాన్ల ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ అయ్యారు. నిజామాబాద్ జిల్లా వాణిజ్య పన్నుల శాఖ సమీక్ష సమావేశాన్ని ఆయన ప్రగతి భవన్‌లో నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోధన్ చలాన్ల వ్యవహారంపై ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ ఇలాంటివి రాష్ట్రంలో ఇంకెక్కడా జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అవినీతిని అరికట్టే విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, వాణిజ్య పన్నుల శాఖ పటిష్ఠంగా పనిచేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. కాగా బోధన్ స్కాం గురించి అది వెలుగులోకి వచ్చిన సమయంలోనే ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. తక్షణం దానిపై విచారణ జరిపి బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement