ఒబామాకు కేసీఆర్ ఆహ్వానం | KCR invites Obama to Hyderabad | Sakshi
Sakshi News home page

ఒబామాకు కేసీఆర్ ఆహ్వానం

Dec 2 2014 12:49 PM | Updated on Sep 2 2017 5:30 PM

ఒబామాకు కేసీఆర్ ఆహ్వానం

ఒబామాకు కేసీఆర్ ఆహ్వానం

రిపబ్లిక్‌ డే విశిష్ట అతిధిగా భారత్‌ రానున్న అమెరికా అధ్యక్షుడిని హైదరాబాద్‌కు ఆహ్వానించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం భావిస్తోంది.

హైదరాబాద్ : రిపబ్లిక్‌ డే విశిష్ట అతిధిగా  భారత్‌ రానున్న అమెరికా అధ్యక్షుడిని హైదరాబాద్‌కు ఆహ్వానించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రయత్నాల్లో భాగంగా ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం  హైదరాబాద్‌లోని అమెరికా  కాన్సులేట్  ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఒబామా పర్యటనపై ఆయన...ఎంబసీ అధికారులతో చర్చించారు. జనవరి 26న ఒబామా ఢిల్లీ వస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ... ఒబామాను ఆహ్వానించే అంశంపై అమెరికా ఎంబసీకి లేఖ రాశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement