అమెరికాలో ‘కాళేశ్వరం’ సంబురాలు 

Kaleshwaram Project Opening Celebrations In US - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ సంబురాలు అమెరికాలో ఘనంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్ర సమితి యూఎస్‌ఏ ఎన్‌ఆర్‌ఐ విభాగం–మిన్నెసొటా ఏరియా తెలంగాణ అసోసియేషన్‌ (మాటా) ఆధ్వర్యంలో మిన్నెసొటాలో ఎడెన్‌ప్రయరీలో ఈ వేడుకలు నిర్వహించారు.

కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ ఎన్నారై విభాగం ప్రతినిధి ఎర్రబెల్లి ప్రేమ్, టీఆర్‌ఎస్‌ ఎన్నారై యూఎస్‌ఏ ప్రాంతీయ ప్రతినిధి కాచం జ్ఞానేశ్వర్, ఉపాధ్యక్షుడు చేపూరి భవాని రామకృష్ణ, మాటా వ్యవస్థాపకుడు అల్లమనేని నిరంజన్,  భీమా రవి, పాతూరి యోగేందర్, ముదిరెడ్డి రాజవెంకట్‌ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరంతో తెలంగాణ రైతుల చిరకాలవాంఛ నెరవేరనుందన్నారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణలోని 40 లక్షల ఎకరాల్లో 2 పంటలకు సాగునీరు అందుతుందన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top