సాగర్‌ ఆయకట్టుకు నీరివ్వాలి: జూలకంటి | julakanti rangareddy on sagar waters | Sakshi
Sakshi News home page

సాగర్‌ ఆయకట్టుకు నీరివ్వాలి: జూలకంటి

Oct 17 2017 3:00 AM | Updated on Oct 19 2018 7:19 PM

julakanti rangareddy on sagar waters - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గత మూడేళ్లుగా నాగార్జునసాగర్‌ నుంచి నీరందక ఆయకట్టు భూములు బీడుగా మారాయని, ఈ రబీ సీజన్‌లోనైనా ఆయకట్టుకు నీరివ్వాలని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి డిమాండ్‌ చేశారు. ఈమేరకు ఆయన సోమవారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ప్రస్తుతం శ్రీశైలం నుంచి సాగర్‌ ప్రాజెక్టుకు నీరు వస్తోందని, అయితే, సాగర్‌ పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకునే వరకు శ్రీశైలం నుంచి నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

నెల రోజులుగా దిగువకు నీటిని విడుదల చేయడం లేదని, శ్రీశైలం ఎగువ ప్రాజెక్టులకే నీరిస్తున్నారని అన్నారు. ఈ పరిస్థితుల్లో ఇపుడు సాగర్‌ పూర్తి స్థాయిలో నిండిన తర్వాతే మిగులు జలాలను పోతిరెడ్డిపాడు, హంద్రీ–నీవా, ముచ్చుమర్రి ప్రాజెక్టులకు వదలాలని కోరారు. నాగార్జున సాగర్‌పై నల్లగొండ, ఖమ్మం హైదరాబాద్‌ తాగునీటికోసం కూడా ఆధారపడి ఉన్నాయన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఏపీ, కేంద్రం, కృష్ణా వాటర్‌ బోర్డుపై ఒత్తిడి తీసుకురావాలని జూలకంటి కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement