
నల్గొండ: వర్షాలు తగ్గటంతో నాగార్జునసాగర్‌కు ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహం తగ్గింది. దీంతో ఆదివారం అధికారులు ప్రాజెక్టు 20 క్రస్ట్ గేట్లను మూసివేశారు. అయితే, 18 ఏళ్ల తర్వాత తొలిసారి జులైలో ప్రాజెక్టు గేట్లు ఎత్తటంతో సాగర్‌కు పర్యాటకుల తాకిడి నెలకొంది. ప్రస్తుతం గేట్లు మూసివేయటంతో ఈ విషయాన్ని పర్యాటకులు గమనించాల్సిందిగా అధికారులు సూచించారు. వరద ఉధృతిని బట్టి నీటి విడుదల చేపడుతామని ఈ సందర్భంగా తెలిపారు. కాగా, నాగార్జునసాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులగా ఉంది.