చక్రపాణి వల్లే నిరుద్యోగులకు అన్యాయం: జగ్గారెడ్డి | Jagga Reddy slams tspsc chairman Ghanta Chakrapani | Sakshi
Sakshi News home page

చక్రపాణి వల్లే నిరుద్యోగులకు అన్యాయం: జగ్గారెడ్డి

Jun 13 2017 7:08 PM | Updated on Sep 5 2017 1:31 PM

చక్రపాణి వల్లే నిరుద్యోగులకు అన్యాయం: జగ్గారెడ్డి

చక్రపాణి వల్లే నిరుద్యోగులకు అన్యాయం: జగ్గారెడ్డి

టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి వైఖరి వల్లే నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోందని..

సంగారెడ్డి: టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి వైఖరి వల్లే నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్‌ నేత తూర్పు జయప్రకాశ్‌రెడ్డి (జగ్గారెడ్డి) విమర్శించారు. ఘంటా చక్రపాణి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు వంత పాడుతూ.. వారు చెప్పిన వ్యక్తులకే ఉద్యోగాలు ఇస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ తరహాలో చక్రపాణి కూడా నియంతలా వ్యవహరిస్తూ.. టీఎస్‌పీఎస్సీని భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు.

ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేనందునే లోపభూయిష్టమైన నోటిఫికేషన్లపై కోర్టులు స్టేలు విధిస్తున్నాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ఓడీఎఫ్, బీహెచ్‌ఈఎల్, బీడీఎల్‌లలో స్థానికులకు ఉద్యోగాలు దక్కేలా రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 371 (డి)ని సవరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, మంత్రి హరీశ్‌ చొరవ చూపాలని ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement