విద్యార్థుల బియ్యాన్ని బొక్కుతున్న హెడ్మాస్టర్ | illegal transportation of essential goods | Sakshi
Sakshi News home page

విద్యార్థుల బియ్యాన్ని బొక్కుతున్న హెడ్మాస్టర్

Mar 24 2015 2:35 PM | Updated on Sep 2 2017 11:19 PM

విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కోసం వినియోగించాల్సిన బియ్యాన్ని బొక్కుతున్నారు.

నల్లగొండ: విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కోసం వినియోగించాల్సిన బియ్యాన్ని బొక్కుతున్నారు. నల్లగొండ జిల్లాలోని ఆత్మకూర్ ఎస్ మండలం మత్తకొత్తగూడెం పాఠశాల ప్రధానోపాధ్యాయుడే బియ్యాన్నిదారి మళ్లిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది.  ప్రాధమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు హరిప్రసాదాచారి విద్యార్థుల హాజరును ఎక్కువగా చూపిస్తూ కొన్ని రోజులుగా బియ్యాన్ని బయట మార్కెట్లో అమ్ముకుంటున్నాడు. రోజుకు సుమారు 10 కిలోల చొప్పున బియ్యాన్ని మిగిలించుకుంటూ మార్కెట్‌లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్టు సమాచారం. మంగళవారం 50 కిలోల బియ్యాన్ని విక్రయించే ప్రయత్నంలో ఉన్న చారిని గ్రామస్తులు పట్టకుని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement