తెలంగాణ కేబినెట్ లో అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు కృతజ్ఞతలు తెలిపారు
హైదరాబాద్:తెలంగాణ కేబినెట్ లో తనకు అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.బంగారు తెలంగాణ సాధన దిశగా అన్ని విధాలా కేసీఆర్ వెంటే ఉంటానన్నారు. ఏ పోర్ట్ పోలియో కేటాయించిన పరిపూర్ణంగా న్యాయం చేస్తానని జూపల్లి తెలిపారు.
మంగళవారం జరిగే మంత్రివర్గ విస్తరణలో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డికి చోటు దక్కనుంది. టీడీపీ నుంచి ఇటీవలే టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో పాటు బీఎస్పీ తరఫున గెలిచి కొద్ది రోజులకే అధికార పార్టీ గూటికి చేరిన ఇంద్రకరణ్ రెడ్డి, వరంగల్ జిల్లాకు చెందిన అజ్మీరా చందూలాల్‌కు మంత్రి పదవులు దక్కనున్నాయి.