మహిళ దారుణ హత్య | Hyderabad: Woman brutally murdered | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి మహిళ దారుణ హత్య

Dec 2 2018 1:14 PM | Updated on Dec 2 2018 1:14 PM

Hyderabad: Woman brutally murdered - Sakshi

జియాగూడ: పురానాపూల్‌ జాతీయ రహదారిపై  ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం అర్ధరాత్రి ఓ మహిళను దారుణంగా కత్తులతో పొడిచి హత్య చేశారు. ఈ సంఘటన కుల్సుంపురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఆమెను చంపడాన్ని గమనించిన ఓ లారీడ్రైవర్‌ అగంతకులను ఎదిరించడంతో వారు అతనిపై తిరగబడ్డారు. ఇన్‌స్పెక్టర్‌ పి.శంకర్‌ తెలిపిన మేరకు.. జియాగూడ జాతీయ రహదారిలో అర్ధరాత్రి ప్రాంతంలో శ్రీకాకుళం వెళ్లే లారీడ్రైవర్‌ దిగంబర్‌మానే లారీని నిలిపి అద్దాలను శుభ్రం చేసుకుంటున్నాడు. 

ఆ సమయంలో లారీ పక్కన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు యూసుఫ్‌నగర్‌కు చెందిన జాహిదాబేగం(40)తో గొడవకు దిగారు. అంతలో జాహెదాబేగం రక్తంతో లారీ ముందుకు వచ్చింది. నిందితులు మళ్లీ ఆమెపై కత్తులతో పొడిచి చంపారు. గమనించిన లారీ డ్రైవర్‌ను కూడా కొద్దిదూరం వెంబడించి అక్కడినుంచి పారిపోయారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్‌టీంను రప్పించి నమూనాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

 కాగా లారీడ్రైవర్‌  నిందితులను, వారి యాక్టివా వాహనాన్ని  ఫోటోలు తీశాడు. దీంతో నిందితులు లారీ డ్రైవర్‌ను వెంబడించి పరారయ్యారు. అయితే ద్విచక్ర వాహనం పలక్‌నూమాలోని జహనూమా ప్రాంతానికి చెందినదిగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు వేగవంతం చేశారు. మృతురాలు వడ్డీకి డబ్బులిచ్చి జీవనం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement